దేశ హితం కోసం బీజేపీలో చేరండి
NEWS Oct 28,2024 11:41 am
దేశ హితం కోసం బీజేపీలో సభ్యత్వం తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి అన్నారు. మెట్‌పల్లి పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గంలో 30 వేలకు పైగా సభ్యత్వ నమోదు చేయించిన స్థానిక నాయకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాశ్ రెడ్డి, నాయకులు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, నవీన్, రమేష్ తదితరులున్నారు.