విద్యార్థినులను పరామర్శించిన మంత్రి దుద్దిల్ల
NEWS Oct 28,2024 07:53 am
పెద్దపల్లి జిల్లా: ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో అస్వస్థతకు గురై, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 53 మంది విద్యార్థినులను పరామర్శించారు రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఆరోగ్య పరిస్థితిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో చర్చించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.