అనుమతుల్లేకుండా బాణసంచా విక్రయిస్తే
కఠిన చర్యలు: మల్యాల SI
NEWS Oct 28,2024 05:19 am
అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండల పరిధిలో లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయించడానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు. దీపావళి ఉన్నందున దుకాణదారులు తప్పనిసరిగా కలెక్టర్ వద్ద లైసెన్స్ పొందాలని సూచించారు. దుకాణదారులు అనుమతి లేకుండా విక్రయించరాదని తెలిపారు.