కోరుట్ల: MBSS విద్యార్థినికి సన్మానం
NEWS Oct 27,2024 04:06 pm
కోరుట్ల పట్టణ అర్బన్ కాలనీకి చెందిన తుమ్మ రాజేశం కుమార్తె తుమ్మ అక్షిత మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటుకు ఎంపికైంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ అక్షితను శాలువతో సత్కరించారు. భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.