మహిళా సంఘం ఆధ్వర్యంలో సన్మానం
NEWS Oct 27,2024 11:52 am
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన నరేందర్ రాజు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లాస్థాయిలో ద్వితీయ శ్రేణిలో రాణించి ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా భట్రాజు మహిళా సంఘం ఆధ్వర్యంలో అభినందించి సన్మానం చేశారు. అనంతరం అధ్యక్షురాలు అరువ లక్ష్మి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లలకు చదువుతోపాటు సంస్కారాన్ని విద్యలతో పాటు వినయాన్ని, విలువలను నేర్పుతూ క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలి కోరారు.