గోదావరి నదిలో పడి వ్యక్తి మృతి
NEWS Oct 27,2024 10:47 am
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్న వెంకటేష్ (26) అనే యువకుడు గోదావరి నదిలో పడి ప్రాణాలు విడిచాడు. ఈ రోజు స్నానాని కోసం గోదావరి నదిలోకి వెళ్లి ఈత రాక నదిలోనే మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.