టేక్మాల్ మండల రైతుల ఇక్కట్లు
NEWS Oct 27,2024 10:57 am
టేక్మాల్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో మండల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లా బీఆర్ఎస్ పార్టీ యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్ అన్నారు. రైతులు వరి కోత మొదలు పెట్టి రోజులు గడుస్తున్నా ధాన్యం అమ్మడానికి కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే మండల వ్యాప్తంగా పూర్తిస్థాయిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేసి మండల రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని మండల అధికారులను ఆయన కోరారు.