దినసరి వేతన కార్మికుల కుదింపు
NEWS Oct 27,2024 08:27 am
కొండగట్టు: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వివిధ వాపకాలు విభాగాల్లో పనిచేస్తున్న దినసరి వేతన కార్మికులను ఆలయ అధికారులు కుదిస్తున్నారు. ప్రసాదం తయారీ కేంద్రంలో పనిచేస్తున్న 14 మంది కొన్ని నెలల క్రితం కోర్టును ఆశ్రయించి తమకు ఆలయం నుంచి ప్రతినెల 18,000 చెల్లించేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆలయ అధికారులు సదరు ఉత్తర్వులను అమలు చేయడం లేదని, అధికారులు కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించారని పేర్కొంటూ మళ్ళీ కోర్టును ఆశ్రయించడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.