గిరిజనుల గోర్ బోలి భాషను
అధికార భాషగా గుర్తించాలి
NEWS Oct 27,2024 06:10 am
లంబాడీలు మాట్లాడే గోర్ బోలిని భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చి అధికార భాషగా గుర్తించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్య దర్శి రమేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. జీవో నెం.3 స్థానంలో కొత్త జీవో, 1/70 చట్టాన్ని అమలు చేయాలన్నారు.