సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపల్ కు సన్మానం
NEWS Oct 26,2024 05:55 pm
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలకు నూతన ప్రిన్సిపల్ శనివారం సంధ్యారాణి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల మాజీ ప్రిన్సిపల్ మృతిచెందగా ప్రభుత్వం సంధ్యారాణికి బాధ్యతలు అప్పగించారు. నేడు ప్రిన్సిపల్ సంధ్యారాణిని విద్యా కమిటీ చైర్మన్ గా సురేందర్, కమిటీ ఆర్గనైజర్ సిద్ధ రాములు, ఏసు పాల్, చందు, శోభ రాణి ఘనంగా సన్మానించారు.