శివంపేట: క్రీడాకారుడికి ఆర్థిక సాయం
NEWS Oct 26,2024 05:47 pm
శివంపేట: ఫుట్ బాల్ క్రీడాకారుడికి మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సహాయం అందజేశారు. శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన తరుణ్ తేజ్ అనే యువకుడు అండర్ 17 వాలీబాల్ జట్టులో మెదక్ జిల్లా కెప్టెన్ గా ఎన్నికయ్యారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొనడం కోసం పెద్దపల్లికి వెళ్తున్న తరుణ్ తేజ్ కు ఖర్చుల నిమిత్తం జడ్పిటిసి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. క్రీడాకారులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.