వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Oct 26,2024 10:20 am
టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వివిధ పార్టీల నేతలు, అధికారులు ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు వరి ధాన్యన్ని అమ్మి మద్దతు ధర పొందాలని అధికారులు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులు పాల్గొన్నారు.