లింగ నిర్ధారణ స్కానింగ్ మిషన్ పట్టివేత
NEWS Oct 26,2024 05:54 pm
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ అంశం మరోసారి చర్చనీయాంశం అయింది. ఓ ఆస్పత్రి నుంచి లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ మిషన్‌ను శుక్రవారం సాయంత్రం కారులో వేరే చోటకు తరలిస్తుండగా రైల్వే గేటు వద్ద పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, వైద్యాధికారుల విచారణలో మరొక స్కానింగ్ మిషన్ కూడా ఉందని కారు డ్రైవర్ చెప్పగా దానిని కూడా అధికారులు సీజ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతుండగా ఇటీవల కేసులు కూడా నమోదయ్యాయి.