పుట్టినరోజున విద్యార్థులకు చిరు కానుక
NEWS Oct 26,2024 09:03 am
మల్లాపూర్ మండలం వేంపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, క్రీడా, సంస్కృతిక కార్యక్రమాల గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని పెద్దపెల్లి జిల్లాకి చెందిన ప్రభుత్వ ఉద్యోగస్తురాలు బి.అనిత తన జన్మదినం సందర్భంగా 130 మంది విద్యార్థులకు mathematics box పంపిణీ చేసారు. పుట్టినరోజున ఇలాంటి మంచి కార్యం చేసిన అనితకి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.