కాదులూరులో మురికికాలువలు అస్తవ్యస్తం
NEWS Oct 26,2024 09:06 am
టేక్మాల్ మండలం కాదులూరు గ్రామంలో మురికి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. గ్రామంలో సుమారు కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీ అధికారులు మురికి కాలువల పూడికతీత పనులు చేపట్టకపోవడంతో మురికి కాలువలలో చెత్తతో, పిచ్చి మొక్కలతో నిండి దుర్వాసన వెదజల్లుతుందని కాలని ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి మురికి కాలువల పూడికతీత పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.