అరెస్ట్ చేయకపోయినా పొత్తు: చంద్రబాబు
NEWS Oct 26,2024 03:22 am
AP: గత ప్రభుత్వ హయాంలో తనను అరెస్ట్ చేయకపోయినా కూటమి పొత్తు ఏర్పడేదేమో అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘మనం నిమిత్తమాత్రులమే. విధి స్పష్టంగా ఉంటుంది. అరెస్ట్ చేయకపోయినా పొత్తు ఉండేదేమో. నా అరెస్ట్ పొత్తు నిర్ణయానికి మరింత ఊతమైంది. సరైన సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేశారు’ అని అన్నారు.