మద్యం మత్తులో మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన వ్యక్తి మృతి
NEWS Oct 26,2024 03:11 am
ఖమ్మం జిల్లా: మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుబల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చోడవరం గ్రామానికి చెందిన కనితి సత్యనారాయణ (45) రెండు రోజుల క్రితం మద్యం మత్తులో మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు.