అనుమానాస్పద స్థితిలో కోతులు మృతి
NEWS Oct 25,2024 05:03 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి శాంతినగర్‌లో సుమారు 45 వరకు కోతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. అయితే మృతి చెందిన కోతులను ఒకే దగ్గర కుప్పలుగా వేసి ఉండటంతో కోతులను ఎవరైనా చంపారా..? లేక ఏదైనా క్రిమిసంహారక మందు తినడం వలన మృతి చెందయా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.