కాంగ్రెస్ నాయకుని హత్య కేసులో నిందితుడు సంతోష్ అరెస్ట్
NEWS Oct 25,2024 02:57 pm
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో జరిగిన కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడిని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ పంపినట్టు తెలిపారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. భూ వివాదాలు పాత కక్షల కారణంగానే సంతోష్ గంగారెడ్డిని హత్య చేశారని రెసిపీ తెలిపారు. గతంలో జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో సంతోష్ పై పలు కేసులు ఉన్నాయి.