మల్లాపూర్: కాలేజీ ఆకస్మిక తనిఖీ
NEWS Oct 25,2024 11:02 am
మల్లాపూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా క్లాస్ రూమ్ లో తనిఖీ చేస్తూ పిల్లలతో మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ వాటి గురించి వివరించారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ విద్యా సంవత్సరం సిలబస్ తొందరగా పూర్తి చేసి, ప్రాక్టికల్స్ వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు సూచన చేశారు.