ఎమ్మెల్యేను సన్మానించిన జగ్గాసాగర్ గ్రామస్థులు
NEWS Oct 25,2024 10:16 am
మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ కొండస్వామి దేవస్థానం ఆవరణలో రైతు పరస్పర సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కి జగ్గాసాగర్ గ్రామస్థులు సత్కరించారు. రైతులు, మార్కెట్ కమిటీ సభ్యులు, రైతు ట్రాన్స్ ఫార్మర్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. రాజారెడ్డి, గంగారెడ్డి, లింగం, సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.