ద్విచక్ర వాహనాలు ఢీ - ఇద్దరి మృతి
NEWS Oct 25,2024 03:35 pm
మెట్ పల్లి పట్టణ శివారులోని వెల్లుల్ల రోడ్డులో ఎదురు ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మధ్య మార్గంలో కన్నుమూశాడు. మృతి చెందిన వ్యక్తులు శ్రీనివాస్(50) బండ లింగాపూర్ గ్రామం. వ్యక్తి స్వామి(42) వెల్లుల్ల గ్రామం. కేసు నమోదు చేసినట్టు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.