వైసిపి ఆధ్వర్యంలో ఓటు నమోదు కార్యక్రమం
NEWS Oct 25,2024 11:06 am
వైసీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం కొండపల్లిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు మిక్కిలి శరభయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అర్హత కలిగిన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యదర్శి పచ్చిగోళ్ళ పండు మాట్లాడుతూ.. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి బలపరిచిన గౌతమ్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.