చిరంజీవిని ఆహ్వానించిన నాగార్జున
NEWS Oct 25,2024 08:35 am
HYD: అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారం అందుకోనున్నారు. చిరంజీవిని వేడుకకు ఆహ్వానిస్తున్న ఫొటోలను నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.