ఏడుపాయలకు తగ్గిన వరద
NEWS Oct 25,2024 03:51 am
ఏడుపాయలకు వరద తగ్గడంతో ఆలయంలో వన దుర్గమ్మకు శుక్రవారం నవమి పుష్యమి నక్షత్రం పురస్కరించుకొని పంచామృతాలతో భృగు వాసరే ప్రత్యేక అభిషేకం పూజలు చేశారు. పలు విధ ద్రవ్యాలు, నిమ్మకాయలు, గాజులు, పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించి, రకరకాల సుగంధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి ధూప, దీపం, పండ్లు, ఫలాలు నైవేద్యం సమర్పించి మంగళహారతి ఇచ్చారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.