విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
NEWS Oct 25,2024 03:34 am
మెట్‌పల్లి: అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకొని మెట్‌పల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పోలీసులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర అనే అంశంపై పోటీలను నిర్వహించారు. సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.