నవంబర్ 1న బీసీ కమిషన్ బృందం
NEWS Oct 25,2024 03:33 am
జగిత్యాల: నవంబర్ 1న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తెలంగాణ బీసీ కమిషన్ బృందం వస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం వస్తుందన్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అభిప్రాయాలను నేరుగా తెలుపవచ్చన్నారు.