మెట్‌పల్లి పట్టణంలో గురువారం రాత్రి మాజీ మంత్రి కేటీఆర్‌కు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. మెట్‌పల్లి మీదుగా కరీంనగర్ వెళ్తున్న ఆయనకు పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు. ఆయన వెంట కోరుట్ల MLA కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.