మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో
ఓపెన్ హౌస్ నిర్వహణ
NEWS Oct 24,2024 12:57 pm
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం వారోత్సవాల్లో భాగంగా మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్, ఆయుధాలు పనిచేయు విధానం వివరించి, రిసెప్షన్ సెంటర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రూమ్, రైటర్, లాకప్ రూమ్ చూపించి, డయాల్ 100, సైబర్ క్రైమ్‌లపై అవగాహనా కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై కిరణ్ కుమార్, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.