అమరావతి డ్రోన్ షో 5 ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. సీఎం చంద్రబాబుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు సర్టిఫికెట్లు అందజేశారు. 1, లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్. 2, లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టి. 3. లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్. 4, డ్రోన్ల ద్వారా అతి పెద్ద జాతీయ జెండా షో. 5, ఏరియల్ లోగోతో డ్రోన్ షో. గిన్నిస్ రికార్డుల్లో పోటీపడిన అమరావతి డ్రోన్ షో చరిత్ర సృష్టించింది. ఒకే సారి 5500 డ్రోన్ల లైటింగ్‌తో ఆకాశంలో వివిధ ఆకృతులను ప్రదర్శించారు.