అమరావతి డ్రోన్ సమ్మిట్ లో భాగంగా విజయవాడ కృష్ణా నదీ తీరంలో నిర్వహించిన దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో కళ్లు జిగేల్‌మనిపించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో ముగిశాక.. 5 వేలకు పైగా డ్రోన్లు గాల్లోకి లేచాయి. డ్రోన్లు వివిధ కళాకృతులతో అందరినీ అలరించాయి. విమానం, బుద్ధుడు, గ్లోబ్ పై భారతదేశ మ్యాప్, డ్రోన్ కల్చర్, 1911 నాటి పోస్టల్ స్టాంపు, భారత త్రివర్ణ పతాకం.. ఇలా వివిధ రూపాల్లో డ్రోన్ లైటింగ్ షో కనులవిందు చేసింది.