ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలను ప్రారంభం
NEWS Oct 22,2024 05:30 pm
మల్యాల మండలంలోని రామన్నపేట, ముత్యంపేట, మల్యాల, తాటిపల్లి, బల్వంతాపూర్ గ్రామాలలో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలను చొప్పదండి MLA మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే కు శాలువాతో సత్కరించి ఆహ్వానించారు. కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు MLA సూచించారు. కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.