రామన్నపేటలో వడ్ల కొనుగోలు కేంద్రం
NEWS Oct 22,2024 03:49 pm
వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రంను వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీకే సెంటర్ ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మహిళల సంఘాల అభివృద్ధి కొరకు ఈ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సభ్యులు ఐకెపి అధికారులు దగ్గరుండి రైతులకు కష్టం కలిగిన చూసుకునే బాధ్యత మన పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు