రైతులకు రుణమాఫీ కాలేదని.. రైతుబంధు రాలేదని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. కనీసం వరి ధాన్యం కొనుగోలులైన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జరిపి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే డబ్బులు చెల్లించాలని కోరారు. అన్ని రకాల సన్నవడ్లకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.