హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం
NEWS Oct 22,2024 03:46 pm
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డ్ సుబ్బరాజు కుటుంబానికి మెట్ పల్లి పోలీసులు మంగళవారం రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందించారు. సుబ్బరాజుకు తల్లి, భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉండగా.. వారి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో పోలీసులు స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ నిరంజన్ రెడ్డి, పలువురు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.