యాదగిరిగుట్టపై వీడియోలు నిషేధం
NEWS Oct 22,2024 01:30 pm
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు ఇటీవల యాదగిరిగుట్టపై చేసిన రీల్స్ చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా ఫోటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధిస్తున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగి జ్ఞాపకార్థంగా భద్రపర్చుకుంటే అభ్యంతరం లేదన్న ఈవో ఇక నుంచి కొండపైన భక్తులు తీసే ఫొటోలు, వీడియోలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.