ఆశిరెడ్డిపల్లె విద్యార్థుల మైక్రో గణపతి
NEWS Oct 22,2024 12:54 pm
సిరిసిల్ల: చందుర్తి మండలం ఎంపీ యుపిఎస్ ఆసిరెడ్డి పల్లెలో ఫోర్త్ క్లాస్ విద్యార్థినిలు రేణుక, హర్షిత 8 మిల్లీ మీటర్ల పొడవుతో క్లే తో మైక్రో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. గతంలో కూడా మట్టితో మైక్రో వెజిటేబుల్స్ నమూనాలను తయారు చేసారు. ఇప్పుడు మైక్రో వినాయకుడి విగ్రహంతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారి ప్రతిభని టీచర్‌లు ప్రశంసించారు.