AP: వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ
NEWS Oct 22,2024 12:26 pm
క్యాస్ట్ సర్టిఫికెట్లు నేరుగా వాట్సాప్ ద్వారా పొందే పద్ధతి అందుబాటులోకి తీసుకొస్తుంది ఏపీ ప్రభుత్వం. వివిధ రకాల బిల్లులు కూడా వాట్సాప్ ద్వారా చెల్లించేయవచ్చు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా వేదికల ద్వారా ప్రపంచమంతా విస్తరించిన మెటాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది. మంత్రి లోకేశ్ చొరవతో ప్రజలకు ప్రభుత్వం నుంచి పౌరసేవలు వాట్సాప్ బిజినెస్ ద్వారా అందించేందుకు మెటా అంగీకరించింది.