నూతన ఉపాధ్యాయులకు సన్మానం
NEWS Oct 22,2024 11:49 am
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గణపతి నరేందర్ రాజు, గుగ్గిల నాగరాజు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారితో పాటు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు క్లాస్‌మెట్స్ వారిరువురిని ఫ్రెండ్స్ స్టార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రాబోయే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, లక్ష్మీనారాయణ, మారుతి, శేఖర్, మమత, అరుణ, స్వాతి, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.