CMRF చెక్కులు పంపిణి చేసిన షబ్బీర్
NEWS Oct 22,2024 12:04 pm
KMR: కామారెడ్డి నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అత్యవసర ఆపరేషన్ నిమిత్తం 60,000 చెక్కును కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డి. కుమార్ కుటుంబ సభ్యులకు అందించారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు షబ్బీర్ అలీకి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.