రైతన్నలను ముంచేసిన అకాల వర్షం
NEWS Oct 22,2024 10:34 am
జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా మల్యాలలో 27.3 మి.మీ వర్షపాతం నమోదైంది. పంటలు చేతికి వచ్చే సమయంలో వర్షాలు పడితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు గోవిందారంలో 26.5, కొల్వాయిలో 9, పూడూర్లో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.