మెట్‌పల్లి మండలంలోని ఆత్మనగర్ గ్రామపంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్ నరసయ్య అనారోగ్యానికి గురయ్యాడు. మంగళవారం ఎంపీడీవో మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని తక్షణ సహాయం కింద రూ. 5000 నగదు అందజేశారు. ఆయన వెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి నిజాముద్దీన్ తదితరులు ఉన్నారు.