భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సుజాతనగర్ మండల పరిధిలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్ పోనిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. మండల బీజేపీ అధ్యక్షుడు రాజేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలని కోరారు.