మక్క కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Oct 22,2024 10:06 am
మల్లాపూర్ మండల కేంద్రంలో మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగల్ విండో చైర్మన్ వెంపేట నర్సారెడ్డి మాట్లాడుతూ.. రైతులు తమ మక్కలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పలత నర్సయ్య, వైస్ చైర్మన్ నారాయణరెడ్డి,డైరెక్టర్ నూతిపెల్లి రాజం, అధికారులు, తదితరులు పాల్గొన్నారు