కాంగ్రెస్‌లో ఉండలేను: జీవన్‌రెడ్డి
NEWS Oct 22,2024 08:37 am
జగిత్యాల: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని హత్య చేశారు. హత్యకు నిరసనగా జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నేతలకే రక్షణ కరువైందని, మీకూ, కాంగ్రెస్‌కో దండం అంటూ వ్యాఖ్యానించారు. అవమానించారు, మానసికంగా వేధించారు.. కనీసం మమ్మల్ని బతకనివ్వరా అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తా.. ఇక ఉండలేనంటూ ఆవేదన వ్యక్తంచేశారు. భౌతికంగా నిర్మూలిస్తుంటే పార్టీలో ఎందుకుండాలంటూ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.