ఓటీటీ టాప్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ ఇప్పుడు సీజన్ 4కి చేరుకుంది. ఈ సీజన్ మొదటి షోని ఏపీ సీఎం చంద్రబాబుతో చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. జైలులో ఎదుర్కొన్న పరిస్థితులు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. గతంలో చెప్పని ఎన్నో కొత్త విషయాలు ఈ షో ద్వారా చంద్రబాబు పంచుకున్నట్టు ప్రొమో ద్వారా తెలుస్తోంది.