ఖమ్మం జిల్లా: ఆటోల రోడ్డు ఇన్సూరెన్స్ ధరలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇన్సూరెన్స్ తగ్గించే విధంగా కృషి చేయాలని కోరుతూ మంగళవారం ఆటో వర్కర్స్ యూనియన్ కార్మికులు ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇన్సూరెన్స్ ధరలు పెరిగిపోవడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇన్సూరెన్స్ ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు.