ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని మంగళవారం భక్తులు వేకువ జాము నుండే దర్శించుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులు తలనీలాలు సమర్పించుకొని, కోనేరులో స్నానమాచరించారు. అనంతరం స్వామి వారి సేవలో తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.