రాయచోటి: ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
NEWS Oct 22,2024 06:29 am
రాయచోటి పట్టణం గునికుంట్ల రోడ్డులోని ఉపాధ్యాయుడు రామ్మోహన్ రెడ్డి ఇంటిలో పట్టపగలు చోరీకి పాల్పడ్డారు. దంపతులు ఇద్దరు ఉపాధ్యాయులు కావడంతో ఇంటికి తాళాలు వేసి స్కూళ్లకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తాళాలు తెరిచి ఉండడం చూసి అవాక్కయ్యారు. ఇంటిలోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి సుమారు 500 గ్రాముల బంగారం, రూ. 4.75 లక్షల డబ్బులు పోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.