పెద్ద శంకరంపేటలో సైకిల్ ర్యాలీ
NEWS Oct 22,2024 06:25 am
పెద్ద శంకరంపేట: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీలో గ్రామ ప్రజలు, విద్యార్థులు టేక్మాల్, రేగోడ్, అల్లదుర్గం, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సీఐ రేణుక రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.